నాలుగో టెస్టులో కోహ్లీ ఆడేనా..?

209
Virat Kohli injury doubt
Virat Kohli injury doubt
- Advertisement -

రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టీమ్‌ఇండియా సాధన సందర్భంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమైన విరాట్‌ భుజానికి పెద్ద బ్యాండేజీతో మైదానంలోకి వచ్చాడు. ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా అతడు కాసేపు అండర్‌ ఆర్మ్‌ త్రోలు మాత్రమే సాధన చేశాడు. ఆ తర్వాత ఫిజియోతో సుదీర్ఘంగా చర్చించాడు. భుజంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే అతడు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమయ్యాడని అనుకున్నారు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు.

kohli

ఐతే.. రాత్రికల్లా అతడికి రక్షణగా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేశారు. ఈ పరిణామాలన్నీ కోహ్లి గాయంపై అనుమానాలను పెంచేశాయి.

రాంచీలోనూ తన గాయంపై ఉన్న సందేహాలను తొలగిస్తూ బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ స్వభావం గురించిన తెలిసినవారు సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టుకు అతను దూరంగా ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం కోహ్లికి ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించనున్నారు. అతడు మ్యాచ్‌ ఆడలేని స్థితిలో ఉంటే అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు.

- Advertisement -