బుల్లితెర పాపులర్ షో కార్తీక దీపం విజయవంతంగా 1094 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఎపిసోడ్లో భాగంగా ఏసీపీ రోషిణి..కార్తీక్‌ని విచారించడం,దీప చెప్పినప్పుడే వినాల్సి ఉండేది తప్పు చేశానని కార్తీక్ బాధపడటం,మోనిత చేసిన మోసాన్ని గుర్తించడంతో ఎపిసోడ ముగుస్తుంది.
అంతా కలిసి తింటుండగానే మోనిత…. కార్తీక్‌కి కాల్ చేస్తుంది. రెండో సారి కాల్ చెయ్యడంతో ఆనందరావు ఉన్నాడనే ఉద్దేశంతో ఫోన్ కట్ చెయ్యకుండా లిఫ్ట్ చేస్తాడు కార్తీక్. నీకో వీడియో పంపిస్తున్నాను అర్జెంట్‌గా చూడు.. మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మోనిత చెబుతుంది. ఆ వీడియో చూసి షాకైన కార్తీక్…టిఫిన్ తినకుండానే బయటికి వెళ్తూ…దీపా.. రాత్రికి పిల్లతో ఇంటికి వెళ్లు దీపా..నేను వచ్చేస్తాను అంటాడు.
మోనిత ఇంటి ముందు ఆగిన కార్తీక్.. అంతే పరుగుతో.. పైకి వెళ్తాడు. మోనిత బెడ్ మీద పడి ఉంటుంది. డాక్టర్ భారతి ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది. టైమ్‌కి ప్రియమణి చూడకపోతే ప్రాణం పోయేది కార్తీక్.. ఇంతదాకా ఎందుకు తెచ్చుకున్నావ్ నువ్వు? ఇప్పుడిప్పుడే దీప నువ్వు కలుస్తున్నారు కదా.. ఈ టైమ్‌లో ఏంటిది అని తిట్టిపోస్తుంది.
ఎలాగో మత్తులో ఉంది కదమ్మా.. ఆ కడుపు ఏదో తీసెయ్యండి.. గొడవ వదిలిపోతుంది.. అప్పటి నుంచే కదా ఈ సమస్యలన్నీ అంటుంది నాటకంగా. ఆ పని చెయ్యండి అంటూ రోషిణీ ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్ షాక్ అవుతాడు. ఎందుకు చేశారు ఈ పని? కార్తీక్‌ని నిలదీస్తుంది రోషిణి. దీప నేను అపార్థాలతో దూరంగా ఉన్నాం.. మా మమ్మీ మమ్మల్ని కలిపే ప్రయత్నం చేసేది.. నేను మోనితని పెళ్లి చేసుకుంటేనైనా ఆ ప్రయత్నాలు ఆపుతుందని అనుకున్నాను.. నేను ఎప్పుడు మోనితని ఫ్రెండ్‌గానే చూశాను.. ఈ తప్పు మాత్రం.. అంటాడు కార్తీక్. మీకు తెలియకుండానే జరిగింది.. అవునా అని రోషిణి ప్రశ్నించగానే అవును అంటాడు కార్తీక్. వీరిద్దరు మాట్లాడుకుంటుంది విని లోలోపల సంతోషపడుతుంది ప్రియమణి.
శ్రీరామ్ నగర్ బస్తీలోని ఇంటికి వచ్చేసిన దీప.. టెన్షన్‌తో జరిగింది గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ కారులో వస్తూ వస్తూ.. జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు. ప్రియమణి ఫోన్ చేసి ఉండకపోతే నాకు ఈ విషయం ఎవరూ చెప్పి ఉండేవారు కాదనుకుంటాను.. ఇదంతా నాటకం.. ఎప్పుడైతే తలవంచడం మానేసి ఎదిరించడం మొదలుపెట్టానో.. ఈ నాటకం మొదలుపెట్టింది.. నేను ఎక్కడ చేజారిపోతానో అని నాకు వీడియో పంపినప్పుడే భారతీకి ఫోన్ చేసింది.. ఒక్క నిమిషం కూడా తేడా లేదు.. అంటే ఇదంతా ప్లాన్ చేసి మరీ ఆడిన డ్రామా.. అప్పుడే ఏసీపీ రోషిణికి ప్రియమణి ఫోన్ చేసి పిలిపించింది అని కార్తీక్ గ్రహిస్తాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.