మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

134
petrol

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్ ధరలను పెంచాయి దేశీయ చమురు కంపెనీలు. డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు ప్రెటోల్‌ ధర రూ.101.84కి చేరగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96గా ఉండగా ముంబైలో పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.97.45, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.93.02, చెన్నైలో పెట్రోల్‌ రూ.102.49, డీజిల్‌ రూ.94.39, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.108.71, డీజిల్‌ రూ.99.02గా ఉంది.