మూసీ నదిపై ఆదిత్య కంపెనీ నిర్మాణాలు:కార్తీక్ రెడ్డి

5
- Advertisement -

మూసీ నది పై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా, పేదలు సామాన్యులు ఉండే హైదర్షాకోట్ విలేజ్ లో అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి.ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దల చేతులు తడిపింది అందుకే వారిని వదిలేశారు… చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వాడుతున్నారు అని ఆరోపించారు.

2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి మా బిఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది , కానీ తర్వాత ఆ పర్మిషన్ ని (Abeyance) నిలుపుదల చేయడం జరిగిందన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోమని మళ్ళీ పర్మిషన్ ఇచ్చిందన్నారు.

2400 కిలోమీటర్ల పొడవున్న నమామి గంగే ప్రాజెక్టుకి అయిన ఖర్చు రూ.40 వేల కోట్లు అయితే గండిపేట నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ నది సుందరీకరణకు అవుతున్న ఖర్చు లక్ష 50 వేల కోట్లు అన్నారు.

అదే కాదు ఈ లక్ష 50 వేల కోట్ల మూసీ నది ప్రాజెక్టు కోసం ఈ ప్రభుత్వం కేవలం DPR కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయబోతుంది.. ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా DPR కోసం ఇంత ఖర్చు పెట్టడం?? అని ప్రశ్నించారు.

Also Read:మంగళ-శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి

- Advertisement -