‘పద్మావత్‌’కు కర్ణి సేన ప్రశంసలు..!

250
Karni Sena declares withdrawal of protest against 'Padmaavat'
- Advertisement -

‘పద్మావత్‌’ సినిమా అద్భుతమని శ్రీ రాజ్‌ పుత్‌ కర్ణి సేన ప్రకటన చేసింది. రాజ్ పుత్ ల గౌరవం పెంచే సినిమా అంటూ ప్రకటించి, ఈ సినిమాపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాని వివరాల్లోకి వెళ్తే… ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ‘పద్మావత్’ సినిమాను వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్‌ యోగంద్ర సింగ్‌ కటార్‌ తమ సంస్థ తరపున మీడియాతో మాట్లాడుతూ, ‘‘ ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలేవీ లేవు. రాజ్‌ పుత్‌ ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్‌ చూశాక ప్రతీ రాజ్‌ పుత్‌ గర్వపడతారు. రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. రాజ్‌ పుత్‌ ల మనోభావాలను ఈ సినిమా దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా ఈ సినిమా ఆడేందుకు సహకరిస్తా’’మని ప్రకటించారు.

Karni Sena declares withdrawal of protest against 'Padmaavat'

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `పద్మావతి` చిత్రం విడుదలపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రాణి పద్మావతి దేవి పాత్రను వక్రీకరించారని రాజ్ పుత్ లో ఆరోపించారు. ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణేల తలలపై రూ.10 కోట్ల నజరానా ప్రకటించడమే కాకుండా భన్సాలీ తల నరుకుతామని – దీపికా ముక్కు కోస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Karni Sena declares withdrawal of protest against 'Padmaavat'

ఆ సినిమా విడుదలైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో పలు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ సినిమాను బ్యాన్ కూడా చేశారు. ఎట్టకేలకు చరిత్రకారుల కమిటీ – సెన్సార్ సభ్యులు …పద్మావతి సినిమా పేరును పద్మావత్ గా మార్చడంతో పాటు మరికొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ సినిమా విడుదలైంది. అయినప్పటికీ కర్ణసేన కొన్ని థియేటర్లపై దాడి చేయడడం – ఆందోళనలు చేపట్టడం – బస్సులను తగులబెట్టడం – స్కూల్ బస్సుపై రాళ్లు విసరడం వంటి ఘటనలు జరిగాయి. ఈ అడ్డంకులను అధిగమించి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రంపై కర్ణిసేన తొలిసారి పాజిటివ్ కామెంట్స్ చేసింది.

- Advertisement -