కాంగ్రెస్‌కు కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్

1
- Advertisement -

కర్ణాటక విధాన పరిషత్ (MLC) ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగా ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ (JD-S) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 8 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ విజయం కంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ (పార్టీ మారి ఓటు వేయడం) చేయడమే.

బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన పలువురు శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తన ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకోవడానికి కనీసం 140 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కానీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కాంగ్రెస్ అభ్యర్థులకు ఏకంగా 151 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఈ అదనపు 11 ఓట్లు ఎక్కడివనే దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇవి కచ్చితంగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల ఓట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు చెందిన వినయ్ కార్తీక్ 32 ఓట్లు, తిప్పన్నప్ప 30 ఓట్లు, బి.ఎస్. శివన్న 30 ఓట్లు,బి.కె. హరిప్రసాద్ 30 ఓట్లు,పి.వి. మోహ న్ 29 ఓట్లతో గెలుపొందారు. బీజేపీకి చెందిన రఘు కౌటిల్య 29 ఓట్లు ,లింగరాజ్ పాటిల్ 27 ఓట్లు రాగా జేడీఎస్‌కు చెందిన గోవింద్ రాజు 14 ఓట్లు రాగా ఓడిపోయారు.

ALso Read;ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే..ఇరాన్ వార్నింగ్!

పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్.టి. సోమశేఖర్, శివరామ్ హెబ్బార్‌లతో పాటు, మరికొంతమంది అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

- Advertisement -