ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే..ఇరాన్ వార్నింగ్!

0
- Advertisement -

ఇరు దేశాల మధ్య కొత్తగా కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదా తుది ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో అదనపు డిమాండ్లు పెట్టినా అమెరికా లేదా దాని భాగస్వామ్య దేశాలకు తిరుగులేని సమాధానం ఇస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్ హెచ్చరించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ నిర్దేశించిన నిబంధనలను అమలు చేయడానికి ఇరాన్ కట్టుబడి ఉందని అయితే ఒప్పందానికి ఎలాంటి భంగం వాటిల్లినా తాము తీవ్రంగా స్పందిస్తామని గాలిబాఫ్ వేదికగా స్పష్టం చేశారు. మేము ఒప్పందంలో పొందు పర్చిన ఆదేశాలకు లోబడి ఉన్నాము. సుప్రీం లీడర్ మాకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే.. ఒప్పందంలోని నిబంధనలను మరియు క్లాజులను నెరవేర్చడం. ఒకవేళ అవతలి పక్షం దురుద్దేశంతో వ్యవహరించినా, ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదా మితిమీరిన డిమాండ్లు చేసినా.. శత్రువుకు కోలుకోలేని దెబ్బ కొట్టడానికి మేము ఏమాత్రం వెనుకాడము అని గాలిబాఫ్ పేర్కొన్నారు.

గతంలో యుద్ధ సమయంలో వారు ఇప్పటికే ఒకసారి మా చేతిలో చెంపదెబ్బ తిన్నారు. వారు మళ్లీ అదే మార్గంలో వెళ్లాలనుకుంటే, ఈసారి అంతకంటే గట్టి దెబ్బ తగులుతుంది అని స్పష్టం చేశారు.

అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా ప్రసంగిస్తూ.. భవిష్యత్తులో జరగబోయే ముఖాముఖి చర్చలను అమెరికా వైఖరిని తాము అంగీకరించినట్లుగా భావించరాదని హెచ్చరించారు. వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు పెడితే ఇరాన్ లొంగిపోబోదని ఆయన స్పష్టం చేశారు.

ALso Read:మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్

- Advertisement -