నీట్-యుజి (NEET-UG) రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. జూన్ 21న జరగబోయే ఈ పరీక్షకు ముందు ప్రశ్నపత్రాల లీకేజీ లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఈ చర్యలు అవసరమేనని కోర్టు అభిప్రాయపడింది.
గతంలో కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణలు రావడంతో జూన్ 21న జరగనున్న రీ-టెస్ట్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది.
పరీక్షా ప్రక్రియ యొక్క పారదర్శకతను మరియు సమగ్రతను కాపాడటానికి ఈ తాత్కాలిక ఆంక్షలు ఒక ముందస్తు నివారణ చర్య మాత్రమేనన్న ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించింది.
Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్
ఈ తాత్కాలిక నిషేధంపై ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు…అంతకుముందు రోజు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత శుక్రవారం నాడు ఈ తుది ఉత్తర్వులను జారీ చేసింది.

