కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల మద్య నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితులు అందరి దృష్టిని కర్ణాటకపై పడేలా చేస్తున్నాయి. కాగా కర్ణాటకలో ప్రస్తుతం ప్రధాన పోరు బీజేపీ, కాంగ్రెస్ మద్య ఉండబోతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రెండు ప్రధాన పార్టీలు విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని కొన్ని అసమానతలు వెంటాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కే విజయావకాశాలు ఎక్కువ అనే విశ్లేషకులు చెబుతున్నారు. .
అలాగే సర్వేలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో అధికారం తమదే అని భావిస్తున్న హస్తంపార్టీకి మరో మిత్రపక్ష పార్టీ షాక్ ఇచ్చింది. అదే శరత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో విపక్షాల ఐక్యతే ఎజెండాగా కాంగ్రెస్ తో చేతులు కలిపింది ఎన్ సి పీ ( NCP ). విపక్షలను ఐక్యం చేస్తూ రెండు పార్టీలు ఆ దిశగా ముందుకు సాగాయి కూడా. ఇటీవల తమంతా ఒక్కటే అని కాంగ్రెస్ నేతలతో బేటీ అయిన శరత్ పవార్.. ఆ మరుసటి రోజే ఎవరు ఊహించని విధంగా కర్ణాటక ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుందంటూ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా షాక్ తగిలింది.
అయితే కాంగ్రెస్ దోస్తీని పూర్తిగా తెగతెంపులు చేసుకొని శరత్ పవార్ సిద్దమయ్యారా ? లేదా కేవలం కర్ణాటక ఎన్నికల వరకు ఎవరికి వారు పోటీ లో దిగాలని నిర్ణయించుకున్నారా ? అనే దానిపై స్పష్టత లేనప్పటికి.. ఎన్ సి పీ ( NCP ) కర్ణాటక ఎన్నికల్లో బరిలోకి దిగడం కాంగ్రెస్ కు ఏ మాత్రం మిగుడు పడని విషయం. దాదాపు 40 – 45 స్థానాల్లో ఎన్ సి పీ ( NCP ) పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ సి పీ ఎంట్రీ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రస్తుతం గెలుపు పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కాంగ్రెస్ పై మిత్రపక్ష పార్టీ ఎంతమేర ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి…