టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌…

396
tsspdcl
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. 2 వేల 525 ఉద్యోగాలకు ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు.

ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనుంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ భర్తీ చేసే పోస్టుల్లో 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2 వేల జూనియర్ లైన్ మెన్ పోస్టులున్నాయని తెలుస్తోంది.

అక్టోబర్ 13 ఉదయం జేపీఓ పోస్టులకు, మధ్యాహ్నం జేఎల్‌ఎం పోస్టులకు, అక్టోబర్ 20 ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -