తమిళ ‘టెంపర్’ రీమెక్‌లో విశాల్..

370
temper movie remake in tamil..
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘టెంపర్’. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో కనిపించి తన నటనతో సూపర్భ్ అనిపించాడు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో పూరి యాక్టింగ్ పరంగా సినిమాకు ప్లస్ అని చెప్పాలి.

temper movie remake in tamil..

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ‘టెంపర్‌’ సినిమాను తమిళంలో రీమెక్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో విశాల్ హీరోగా కనిపించనున్నాడు. ఈ కథలో కొన్ని సన్నివేశాలను మార్పులు చేర్సులు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెయిన్‌ పాయింట్‌ను బలంగా చూపించాలనుకుంటున్నారట. తెలుగులో సూపర్ హిట్‌ను సాధించిన ఈ మూవీని తమిళ ప్రేక్షకుల ఆదరిస్తారో లేదో చూడాలి. విశాల్ ప్రస్తుతం గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. ఈ సినిమా తమిళంలో (శుక్రవారం) విడుదలైంది.

- Advertisement -