కాంగ్రెస్ కు దెబ్బ తీస్తోంది అదే !

61
- Advertisement -

అన్నీ బాగానే ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత అంశాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి. కర్నాటక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన.. సి‌ఎం ఎవరో తేల్చలేని పరిస్థితి ఏర్పడిందంటే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కర్నాటక సి‌ఎం రేస్ లో మాజీ సి‌ఎం సిద్దిరామయ్య అలాగే కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గట్టిగా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరిని సి‌ఎం చేయాలనే దానిపై కర్నాటక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న జరిగిన సిఎల్పీ సమావేశంలో సి‌ఎం ఎవరనే దానిపై ఒక క్లారిటీ వస్తుందనుకుంటే.. ఎటు తేల్చలేక తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశారు కాంగ్రెస్ ఎమ్మేల్యేలు..

ఇద్దరు నేతలు కూడా సి‌ఎం పదవి కోసం ఉబలాటపడుతుండడంతో ఒకరిని సి‌ఎం గా ప్రకటిస్తే ఒంకొకరి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో చెరో రెండున్నర సంవత్సరాలు సి‌ఎంగా కొనసాగే విధంగా ప్రతిపాదన రాగా అందుకు సిద్దిరామయ్య ఒకే చెప్పినప్పటికి.. డికె శివకుమార్ మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో తాము నిర్ణయం తీసుకోలేమంటూ తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశారు హస్తం నేతలు. దీంతో సి‌ఎం రేస్ లో ఉన్న సిద్దిరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా నేడు డిల్లీలో మల్లికార్జున్ ఖర్గే తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం సి‌ఎం ఎవరనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read:Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !

సి‌ఎం గా ఎన్నికైన వారు ఈ నెల 18నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నప్పటికి నేతల మద్య సమన్వయ లోపం ఉండడం వల్ల పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతు వస్తోంది. బంపర్ మెజారిటీతో కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టినప్పటికి సి‌ఎం ఎవరనేది తేల్చుకోలేపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ లో అందరూ లీడర్లే అనే అపవాదం మరోసారి రుజువైంది. హస్తం పార్టీలో అన్నీ ఉన్నా నేతల మద్య ఉండే ఈ సమన్వయ లోపమే ఆ పార్టీ ని తీవ్రంగా దెబ్బ తీస్తోందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికైనా హస్తం పార్టీ ఈ సమస్య ను అధిగమిస్తుందేమో చూడాలి.

- Advertisement -