Rahul Gandhi:పరువు నష్టం కేసు..కోర్టులో అప్పీల్

47
- Advertisement -

మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని కొల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నారు. రేపు సూరత్ సెషన్స్ కోర్టులలో అప్పీల్ చేయనున్నారు రాహుల్. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు.

దీనిని సవాల్ చేస్తూ సూరత్ కోర్టును ఆశ్రయించనున్నారు రాహుల్. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది. ఆ ప్రకారమే రాహుల్ రేపు సవాల్ చేయబోతున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదా తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలిసింది.

పైకోర్టు గనుక.. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే… రాహుల్ గాంధీకి పార్లమెంట్ సభ్యత్వం తిరిగి దక్కుతుంది. అలా కాకుండా.. కింది కోర్టు తీర్పును సమర్థిస్తే.. అప్పుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -