ముందస్తు ఎన్నికలా.. జగన్ నష్టమే?

39
cm jagan
- Advertisement -

ఏపీ ప్రస్తుతం ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఈ మద్య కాలంలో అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో సి‌ఎం జగన్ ముందస్తు ఎన్నికల వైపు చూస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనపడడం, చాలమంది ఎమ్మెల్యేల పనితీరుపై సి‌ఎం జగన్ అసంతృప్తిగా ఉండడం దానికి తోడు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ పుంజుకోవడం వంటివి చూస్తే.. వైసీపీకి ప్రజల్లో వ్యతిరేక గాలి విస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దాంతో ఇంక ఆలస్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఘోర వైఫల్యం తప్పదేమో అనే భావనకు ఏపీ సి‌ఎం జగన్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం జగన్ సర్కార్ పై ఉన్న సానుకూలతను ఓట్లుగా మలుచుకోవాలంటే ముందస్తు ఎన్నికలే ఉత్తమమైన మార్గమని ఏపీ సి‌ఎం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మద్య సి‌ఎం జగన్ వరుసగా డిల్లీ పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, ప్రధాని మోడి, అమిత్ షా, నిర్మలసీతారామన్ వంటి వారితో భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల విషయమై చర్చించేందుకే జగన్ సమావేశమౌతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమే అని కూడా చెబుతున్నారు చంద్రబాబు. ఒకవేళ జగన్ నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తే..అది వైసీపీకి నష్టమే అనేది కొందరి వాదన. ఎందుకంటే ప్రస్తుతం పార్టీలో అనిశ్చితి ఉందనేది ఎవరు కాదనలేని విషయం. ఎమ్మెల్యేలలో తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మేల్యేలు రెబెల్స్ గా మారడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. మరికొంత మంది ఎమ్మేల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఈ నేపథ్యంలో సి‌ఎం జగన్ ఏమాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన చాలమంది ఎమ్మేల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనేది కొందరి వాదన. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? లేదా గతంలో చెప్పినట్లుగానే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సై అంటారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -