మళ్లీ ప్రేమలో పడ్డ బాలీవుడ్‌ బ్యూటీ..!

221
Karisma Kapoor's secret love with Sandeep Toshniwal
- Advertisement -

రెండు మనసులు దగ్గరైతే…అది ప్రేమగా మారే అవకాశం ఎక్కువగానే  ఉంటుంది. ఆ ప్రేమ నిజమైతే.. ప్రేమ తర్వాత? పెళ్ళి.  పెళ్ళి తర్వాత..? ఇంకెముంది విడిపోవడమే. మరి ఆ తర్వాత? మళ్లీ ప్రేమలో పడటం..!! ఇదేంటి అయోమయంగా ఉంది అనుకుంటున్నారా..? అవునండీ.. బాలీవుడ్‌ లో ఇప్పుడు ఇదంతా కామన్‌ అయిపోయింది.  కాదు కాదు చాలా చాలా కామన్ అయిపోయింది.

 Karisma Kapoor's secret love with Sandeep Toshniwal

బాలీవుడ్‌ లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళి తర్వాత విడిపోయిన వాళ్ళూ ఉన్నారు. ఇలా బాలీవుడ్ లో ఎక్కువగానే జరుగుతున్నాయి.  ఇప్పుడు అదే  జాబితాలో కరిష్మా కపూర్ కూడా చేరిపోయింది. తన భర్త సంజయ్ కపూర్ తో గతేడాది విడాకులు తీసుకుంది.  కరిష్మాకపూర్  కు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కరిష్మ కొంత కాలం ఒంటరిగానే గడిపింది.  కానీ ఒక్కసారిగా కరిష్మ మనసు మార్చుకున్నట్టుంది. గత కొద్ది కాలంగా సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉంటోందట ఈ అమ్మడు.

అంతే కాకుండా తన కుటుంబంలో జరిగే అన్ని వేడుకలకు అతన్ని ఆహ్వానిస్తోందట. ఇటీవలే కరిష్మ తండ్రి రణధీర్ కపూర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కూడా అతడిని వెంటబెట్టుకొచ్చిందట కరిష్మ. అంతటితో ఆగకుండా..మరోసారి తన చిన్న తాత శశికపూర్ ఇంట్లో విందు కార్యక్రమం ఉంటే…అక్కడకు కూడా సందీప్ ను తీసుకెళ్లిందట. ఇక ఇంకేముందీ.. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, వీరి చెట్టాపట్టాలకు హద్దులు లేకుండా పోతుందని బాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని కూడా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -