అందుకే ఇప్పుడు ఆ..ఇబ్బందులు..!

238
Anushka is in a trouble
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ అనుష్క రేంజే వేరు. తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..తాను ఒక హీరో కాని హీరో.  కొత్తగా రిలీజ్‌ అయ్యే సినిమాలకి రిలీజ్‌ రోజే భారీ వసూళ్ళు కురిపించడానికి కారణం ఆ హీరోకి ఉన్న క్రేజ్‌. అంతటి క్రేజ్ ని సంపాధించుకుంది అనుష్క. ఎందుకంటే.. లో బడ్జెట్ మూవీస్ మాత్రమే కాకుండా.. ఎంత  బడ్జెట్ పెట్టినా.. హీరోయిన్స్ సింగిల్ హ్యాండ్ తో సినిమాలు లీడ్ చేయొచ్చు అన్న విషయాన్ని రుజువు  చేసింది ఈ స్వీటి.

అనుష్క ఉందంటే చాలు థియేటర్లకు దారితీసే అభిమానులు బోలెడంత మంది ఉన్నారు. అరుంధతి, రుద్రమదేవి లాంటి కేరక్టర్స్ తో రోల్ మోడల్ గా నిలిచింది అనుష్క. అయితే ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..అనుష్కకి కష్టాలు తప్పవన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే తన నటనతో పాటు తన గ్లామర్‌ కి కూడా యూత్‌ ఫిదా అయిపోయిన మాట వాస్తవం.  ఆ గ్లామర్‌ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాధించుకోవడంలో ఒక కారణమైంది.

అలాంటి ఆ గ్లామర్‌ ఇప్పుడు కనిపించట్లేదని అనుష్క ఫ్యాన్స్‌ తెగ బాధపడిపోతున్నారు. క్యారెక్టర్లకి తగ్గట్టుగా తన బాడీ షేప్స్‌ ని చేంజ్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది అనుష్క. అదే క్రమంలో ‘జీరోసైజ్‌’ సినిమాలో లావుగా కనబడడం కోసం అనుష్క బరువు పెరిగిన విషయం అందరికీ  తెలిసిందే. అయితే అప్పుడు చేసిన ఆ ప్రయత్నం ఇప్పుడు అనుష్కని ఇబ్బందులకు గురి చేస్తోంది.  అనుష్క నటించిన సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. అవే ‘సింగం 3’ (యముడు 3) .. ‘ ఓం నమో వేంకటేశాయ’ సినిమాలు. ఈ సినిమాలో అనుష్కను చూసిన అభిమానులు నిరాశకు లోనయ్యారు.

తాజాగా ఈ భామ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. ఒక్క రోజు తేడాలో అనుష్క నటించిన రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిలో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. ఈ రెండు మూవీస్ లో అనుష్క భారీ దేహం అభిమానులను భయపెట్టేసింది.

దాంతో వాళ్లు ఏప్రిల్ లో వచ్చే ‘బాహుబలి 2’ పై ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఇందులోనైనా సన్నగా కనబడి  మరో సక్సెస్‌ ని అందుకుంటుందని అనుకుంటున్నారు. అయితే కొన్ని వారాల క్రితం ఇచ్చిన పోస్టర్ లో అనుష్క సన్నగా కనిపించడం.. కేవలం గ్రాఫిక్స్ మహిమే అనే విషయం అర్ధమైపోయింది. ఇక తమ స్వీటీని మునుపటిలా చూడలేమా అని బెంగ పెట్టేసుకున్నారు అనుష్క ఫ్యాన్స్‌.

- Advertisement -