రూ.1కే రోగ నిర్థారణ పరీక్షలు..కరీంనగర్ మేయర్ మరో వినూత్న పథకం.

377
Karimnagar-mayor
- Advertisement -

కరీంనగర్ మేయర్ రవిందర్ సింగ్ వినూత్న పథకాలతో కరీనంగర్ ను అభివృద్ది పధంలో నడిపిస్తున్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే పేదవారి కోసం రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ పథకం అద్బుతమని చెప్పారు. తాజాగా ఆయన మరో వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయిలే పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా పలు నగరాలు కొత్త విషయాలతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రూపాయికే రక్తం, మూత్రం, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన పరికరాలు కొనుగోలు, ప్రయోగశాల కోసం రూ.25 లక్షలు మంజూరు చేశారు . టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచన మేరకు తానీ సంక్షేమ పథకాలకు అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -