బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరు కరీనా కపూర్. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ఎవరితో డేట్‌కు వెళ్లానకుంటున్నారని సిమీ గరేవాల్ అడగగా వెంటనే రాహుల్ గాంధీ అని చెప్పేసింది కరీనా.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చో,చెప్పకూడదో తెలియదు,వివాదాస్పదమైన సరే తాను రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. రాహుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందని నిర్మోహమాటంగా చెప్పారు కరీనా.
రాహుల్ ఫోటో చూస్తే అతడితో మాట్లాడితే ఎలా ఉంటుందా అనిపిస్తుందని కానీ మాది సినిమా ఫ్యామిలీ రాహుల్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి మా మధ్య జరిగే చర్చ ఆసక్తికరంగా ఉంటుందేమోనని తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ. 2012లో సైఫ్, కరీనాలకు పెళ్లి కాగా వీరికి రెండేళ్ల కుమారుడు తైముర్ అలీఖాన్ ఉన్నారు.
ప్రస్తుతం కరీనా కపూర్ ‘గుడ్‌న్యూస్’లో నటిస్తోంది. సంతానం కోసం తాపత్రయపడే భార్యాభర్తల నేపథ్యంలో సాగే చిత్రం ‘గుడ్‌న్యూస్’. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జీత్ సింగ్, కియారా అద్వానీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.