శాండల్‌వుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై అనతికాలంలో పాన్ ఇండియా సినిమాగా ఎదిగిన కాంతార. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఆఖండ విజయం సాధించింది. దీంతో భారతదేశమంతటా భూతకోలపై అవగాహన ఏర్పడింది. అంతేకాదు సినిమా ఎఫెక్ట్ వల్ల కర్ణాటక ప్రభుత్వం భూతకోల ఆడే వ్యక్తులకు పెన్షన్ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతలా ఈ సినిమా ప్రజలకు కనెక్ట్ అయ్యింది.
హోంబలే ఫిల్మ్ నిర్మాత కీలకమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కాంతార-2కు మేము ప్రణాళికలు సిద్దం చేశాం. దర్శకుడు ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. జూన్‌లో షూట్ మొదలు పెట్టి వచ్చే యేడాది ఏప్రిల్ లేదా మేలో విడుదల చేస్తామన్నారు. అయితే ఇది కాంతారకు స్వీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని వివరించారు.
భూతకోల నేపథ్యంలో వచ్చిన కాంతారకు సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో రెండు రకాలుగా సినిమా తీయనున్నట్టుగా శాండల్‌వుడ్‌లో సమాచారం. పంజుర్లీ దైవానికి రాజుకు మధ్య ఉన్న ఒప్పందం తలెత్తిన సమస్యలు నేపథ్యంలోనే దీన్ని ఎక్కువగా చూపించనున్నట్టు సమాచారం. మరికొందరి అభిప్రాయం శివ, వాళ్ల తండ్రి అడవిలో ఎందుకు మాయమైపోయారో వివరించే విధంగా తీయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాంతార మొదటి పార్టు కంటే కాంతార-2 కు సినీ ప్రేక్షకులు ఈగర్లీ వేయిటింగ్.
ఇవి కూడా చదవండి…
సీడెడ్ లో వీర, నైజాంలో వీరయ్య విన్నర్స్
ఆ యాంకర్లిద్దరికీ నేడు చేదు జ్ఞాపకం
‘పుష్ప 2’ నేపథ్యం అదే !