కాంతార సినిమాపై ఫిర్యాదు..నిజమేంత?

169
- Advertisement -

శాండల్‌వుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై భారతదేశమంతటా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార. భాష ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇప్పుడు కాంతార సినిమాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచిని వరాహ రూపం దైవ వరిష్ఠం పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై తాజాగా కేరళలోని ఓ సంగీత బృందం థాయికుడ్‌ బ్రిడ్జ్‌ ఆరోపణలు చేసింది. తమ బృందానికి చెందిన నవరసం అనే పాటకు కాపీ చేశారంటూ పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది.

కాంతార సినిమాకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలోని వరాహ రూపం పాట మేము రూపొందించిన నవరసం పాటలానే ఉంది. మా అంగీకారం లేకుండా ఇలా కంపోజ్‌ చేయడం కాపీ రైట్‌ చట్టాన్ని అతిక్రమించడమే. స్ఫూర్తిగా తీసుకొని పాటను చేయడానకి, కాపీ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. అలాగే అది వివాదస్పదం కూడా. అందుకే మేము ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మేము మా శ్రోతలందరినీ మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కొరుతున్నామని ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుకు కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్‌ చేసింది. థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ కు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.

- Advertisement -