చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన కాంతార సినిమా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సప్తమి గౌడ కథానాయిక. కాంతార సినిమా కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై… హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్బ్ అయి రికార్డులు తిరగరాసింది.
హోంబలే ఫిల్మ్స్ వారు కేవలం రూ.16కోట్లతో నిర్మించి రూ.400కోట్లకు పైగా వసూలు సాధించింది. హిందీ వెర్షన్ సినిమాను బాలీవుడ్లో అనేక వారాల పాటు ఆడింది. ఈ సినిమాను ప్రభాస్, ధనుష్, అనుష్క శెట్టి, సిద్దాంత్ చతుర్వేది, శిల్పాశెట్టి, కంగనా రనౌత్, రజినీకాంత్, క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకడు విజయ్ కిరగందూర్ ఇటీవలే ఒక వార్త ఛానెల్ ఇంటర్వ్యూ ఇస్తూ త్వరలోనే ఈ చిత్రానికి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ డెవలప్ చేయనున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం రిషభ్ విదేశాల్లో ఉండటం వల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రిషబ్ ఓకే అంటే కాంతార 2షూటింగ్ ప్రారంభిస్తామని విజయ్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి…