దయచేసి అనుకరించవద్దు :రిషబ్‌ శెట్టి

272
- Advertisement -

చిన్న సినిమాగా ప్రారంభమై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం… కర్ణాటకలోని తుళునాడులో జరిగే సంప్రదాయకమైన భూతకోల సంస్కృతిని, ఆచారాలను ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు.

ఇక దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ… అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఈ సినిమాలో చూపించారు. ఆ ధ్వని వినిపించిన ప్రతిసారీ థియేటర్లో ఒకరకమైన ప్రేక్షకులు ఆనుభూతిని పొందుతారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ…అంటూ అనుకరణ చేస్తూ… సినిమాపై తమ అభిమానాన్ని బయటపెడుతున్నారు.

అయితే తాజాగా నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి స్పందిస్తూ… ఓ.. అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని .. అది తమకు ఓ సెంటిమెంట్ అని అన్నారు. కాంతార వీక్షించిన ప్రేక్షకులందరికీ నా చిరు విన్నపం. సినిమాలో ఉపయోగించిన శబ్దాలను అనుకరించొద్దు.

ఇదొక ఆచారమని, ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే ఇది చాలా సున్నితమైన అంశమని అన్నారు. దీనివల్ల ఆచారం దెబ్బతినొచ్చు అని ఆయన వివరణ ఇచ్చారు. ప్రేక్షకులు ఏవరూ కూడా ఆనుకరణ చేయకూడదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -