Congress:కాంగ్రెస్ నెత్తుటి రాజకీయం

32
- Advertisement -

పచ్చటి తెలంగాణలో కాంగ్రెస్ నెత్తుటి రాజకీయం చేస్తోంది. వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ముగ్గురిని కత్తితో పొడిచిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బీందాస్. కామారెడ్డి – ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండిపేట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన జావిద్, అహ్మద్, రజాక్ అనే ముగ్గురు యువకులు గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి సంబందించిన పోస్టింగులు పెడుతుండగా కాంగ్రెస్ గ్రామాధ్యక్ష్యుడు బీందాస్ గ్రూప్ నుండి వారిని తొలగించారు. గ్రూప్ నుండి ఎందుకు తొలగించావని ప్రశ్నించిన పాపానికి బీందాస్ ముగ్గురిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. వారిలో అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీని తరిమికొడుదాం…మన తెలంగాణ ప్రశాంతతను కాపాడుకుందాం అని గ్రామస్తులు పిలుపునిచ్చారు.

Also Read:కల నెరవేరేనా.. కప్పు కొడతారా?

- Advertisement -