- Advertisement -
విలక్షణ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆస్పత్రిలో చేర్చారు. రాత్రి కాస్త జ్వరంగా ఉండటం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు కమల్. కమల్ హాసన్ క్షేమంగా ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్.. తన గురువైన కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడం, ఆస్పత్రిలో చేరడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం కమల్…శంకర్‌తో ఇండియన్ 2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్‌తో విక్రమ్‌తో నాలుగు వందల కోట్ల వసూళ్లను రాబట్టారు కమల్.
ఇవి కూడా చదవండి..
- Advertisement -