రజనీ 100 శాతం అర్హుడు: కమల్

209
kamal
- Advertisement -

సినీ రంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సందర్భంగా తలైవాకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా తాజాగా కమల్ హాసన్ స్పందించారు. సూప‌ర్ స్టార్‌, నా ప్రియ మిత్రుడు ర‌జ‌నీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. అత‌నికి ఈ అవార్డు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి 16 సినిమాల్లో న‌టించ‌చగా వీరిద్దరూ కలిసి 1985లో హిందీ మూవీ గిర‌ఫ్తార్‌లో క‌లిసి న‌టించారు.

ఇక మరోవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్….ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయమనేది మురికి కూపం… దాన్ని కడిగేందుకే రాజకీయాల్లోకి వచ్చా అని స్పష్టం చేస్తున్నారు. ఇక కమల్ ర్యాలీ, రోడ్‌ షోలకు విశేష స్పందన వస్తోంది. ఇప్పుడు రాజకీయాలను శుభ్రం చేయకపోతే… భవిష్యత్తు తరాలు ఇప్పటి తరం వారిపై దుమ్మెత్తిపోస్తాయని చెబుతూ ముందుకు సాగుతున్నారు కమల్.

- Advertisement -