రాజస్థాన్ రాయల్స్‌లోకి ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ..!

215
ipl
- Advertisement -

ఇదేంటి ఫుట్ బాల్ దిగ్గజం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అనుకుంటున్నారా..? వినడానికి షాక్‌గా ఉన్న రాజస్ధాన్ రాయల్స్ డైరెక్టర్,కోచ్‌ కుమార సంగక్కర చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

త్వరలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు విషయాలను వెల్లడించిన సంగక్కర..స్మిత్‌ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంజూ శాంసన్‌తో​ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో ఓఅభిమాని అడిగిన ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇచ్చారు మెస్సీ.

ఫుట్‌బాల్‌ స్టార్‌గా పేరున్న అర్జెంటీనా ఆటగాడు లియోనల్‌ మెస్సీని వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌ వేలంలో పరిగణలోకి తీసుకుంటారా అని ఒక అభిమాని ప్రశ్నించగా తప్పకుండా అని తెలిపాడు సంగక్కర. మెస్సీలో క్రికెట్‌ ఆడే లక్షణాలు ఉన్నాయి…. అవకాశం ఉంటే మెస్సీని వచ్చే ఏడాది వేలంలో తప్పకుండా తీసుకుంటాం అని చమత్కరించాడు.

- Advertisement -