అమెరికాలో కాల్పుల కలకలం…

250
america
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఆరెంజ్‌ సిటీలో బుధవారం సాయంత్రం కాల్పులు కలకలం చోటుచేసుకోగా ఆరెంజ్‌ సిటీలోని లికోయిన్‌ అవెన్యూ ఆఫీస్‌ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి పోలీసుల ఫైరింగ్‌లో గాయపడ్డాడు. దీంతో అతన్ని దవాఖానకు తరలించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరెంజ్‌ సిటీ పోలీస్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

వారంరోజుల క్రితం బౌల్డర్‌ని సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -