ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా నటించిన ‘ఎమ్మెల్యే’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎమెల్యే భీభత్సమైన అంచనాలు లేకపోయినా చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది వచ్చిన మాస్ సినిమాగా ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకుంది. కంటెంట్ విషయంలో టాక్ రివ్యూలు కొంచెం తేడాగా ఉన్నప్పటికీ మొదటి రోజు ఎమెల్యేకు ఓట్లు బాగానే పడ్డాయి. పోటీ సినిమాలు ఉన్నా కూడా దీనికి ధీటుగా నిలిచే విషయం వాటిలో లేకపోవడంతో కళ్యాణ్ రామ్ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది.
సిని వర్గాల సమాచారం మేరకు ఎమెల్యే మొదటిరోజు సుమారు 5.2 కోట్ల గ్రాస్ తో 3.3 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. ఎలా చూసుకున్నా ఇది డీసెంట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే స్టడీగా వారం పాటు ఉంటేనే అందరు సేఫ్ అవుతారు. థియేట్రికల్ బిజినెస్ 13.5 కోట్ల దాకా జరిగింది. ఇందులో ఓవర్సీస్ రేట్ కలపలేదు. లాభాలు రావాలంటే 20 కోట్ల షేర్ కు కనీసం దగ్గరగా వెళ్ళాలి. బ్రేక్ ఈవెన్ కావాలన్నా 18 రావాలి. ఇప్పుడున్న టాక్ ఇలాగే కంటిన్యూ అయితే కష్టం కాని ప్రమోషన్ విషయంలో మరికాస్త ఫోకస్ పెంచితే బిసి సెంటర్స్ లో బాగానే లాగొచ్చనేది ఒక అంచనా.
కళ్యాణ్ రామ్ కు ఇది సవాల్ లాంటిది. గెలిచాడా మే లో వచ్చే అతని కొత్త సినిమా నా నువ్వే బిజినెస్ కి చాలా ప్లస్ అవుతుంది. ప్రస్తుతానికి పోటీ సినిమా బలంగా ఏది లేదు కాబట్టి ఎమెల్యే కాస్త గట్టిగా ప్రచారం చేసుకుంటే ఇంకాస్త ఓట్లు అదనంగా పడే అవకాశాలు ఉంటాయి. ఈ వీకెండ్ లో వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.