యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గరుడవేగ మూవీలో పోలీస్ పాత్రలో నటించిన రాజశేఖర్ మరోసారి అలాంటి పాత్రలోనే ప్రేక్షకుల ముందుకువచ్చారు. మరి కల్కితో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…
కథ:
కొల్లాపూర్ అనే సంస్థానం నేపథ్యంగా సినిమా సాగుతుంది. తొలిసారిగా అక్కడ జరిగిన ఎన్నికల్లో నర్సప్పపై రాజమాత భారీ మెజార్టీతో గెలుస్తుంది. అయితే పెరుమాండ్లు సాయంతో రాజమహల్‌కు నిప్పు పెడతారు నర్సప్ప(అశుతోష్ రాణా). అప్పటినుంచి కొల్లాపూరు నుంచి నల్లమల వరకు అంతా నర్సప్ప కనుసన్నల్లో జరుగుతుంటుంది. సీన్ కట్ చేస్తే నర్సప్ప నుంచి దూరమవుతాడు పెరుమాండ్లు. తర్వాత సీన్‌లోకి నర్సప్ప తమ్ముడు శేఖర్ ఎంటరవడం..అతడు చనిపోవడంతో ఏం జరుగుతుంది..ఈ కేసు ఇన్వేస్టిగేషన్ కోసం వచ్చిన కల్కి(రాజశేఖర్) ఏం చేశాడు..?కొల్లాపూర్ మహారాణి బతికే ఉంటుందా..?చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు,కామెడీ,యాక్షన్ సన్నివేశాలు,లొకేషన్లు.
మైనస్ పాయింట్లు:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ,వాస్తవానికి-కర్మకు లింకు పెట్టడం,పాటలు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు కథపై దృష్టి సారిస్తే బాగుండేది. వర్షంలో తీసిన ఫైటు, ఫారెస్ట్ ఫైట్ ఆకట్టుకుంటాయి.ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సి కల్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
గరుడవేగ మూవీలానే కల్కిలోనూ ఖాకీ ఫార్ములానే ఎంచుకున్నారు రాజశేఖర్. స్టైల్ విషయంలోగానీ, హుషారుగా ఫైట్లు చేయడంలోగానీ ,సీఆర్‌పీఎఫ్ జవానుగా కనిపించే సన్నివేశాల్లోనూ రాజశేఖర్ నటన సూపర్బ్. అయితే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో స్క్రీన్ ప్లే ప్రధానం. కానీ ఎక్కడా స్క్రీన్ ప్లేతో మెప్పించలేదు.దీనికి తోడు సైన్స్ లో ఉన్న లాజిక్కులకు, కర్మకు లింకులు పెట్టే అంశాలు అన్నివర్గాల ప్రేక్షకులకు అర్ధం కావు. మొత్తంగా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ కల్కి.
విడుదల తేదీ:28/06/2019
రేటింగ్:2.5/5
నటీనటులు: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత,
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ