విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కాళేశ్వరం

771
Kaleshwaram-Project-Telangana
- Advertisement -

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం అంతేరికార్డు స్ధాయిలో కేవలం 3 సంవత్సరాల్లోనే పూర్తైంది. సాగునీటి చరిత్రలో ఇదోక అరుదైన సంఘటన.

ఈ నేపథ్యంలో కాళేశ్వం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకుంది. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ సమయంలో పనులు పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్, కంట్రీ రికార్డ్స్ లో స్థానాన్ని పొందింది. ప్రాజెక్టును నిర్మించిన నిర్మాణ సంస్థ ‘మేఘా’తో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ మోటార్లను తయారు చేసి అందించిన బీహెచ్ఈఎల్ సైతం ఈరికార్డులో చోటు దక్కించుకున్నాయి.

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మూడు బ్యారేజీలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 20 లిఫ్ట్‌లు, 19 పంపు హౌస్‌లు, మొత్తం 147 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరంతో హైదరాబాద్‌ నగరం, పల్లెలకు 40 టీఎంసీల తాగునీరు,పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది.

- Advertisement -