మెగాస్టార్ 40 ఏళ్ల నట ప్రస్థానం..

345
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పరిచయమైన ఈ రోజుకు సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తైంది. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అపై చిరంజీవిగా పేరు మార్చుకుని.. అనంతరం మెగాస్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి ఆగస్ట్ 22,1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.

తండ్రి వృత్తిరిత్యా కానిస్టేబుల్ అయినందున పాఠశాల విద్యను వివిధ ప్రాంతాల్లో పూర్తి చేసారు. ఇంటర్మీడియెట్‌ను ఒంగోలులోని సి.ఎస్.ఆర్ కాలేజీలో అలాగే నర్సాపూర్‌లోని వైఎన్ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు.

Megastar Chiranjeevi

ఎలాంటి గాఢ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఇండస్ట్రీ అంటే మెగా ఫ్యామిలీ అన్నట్టుగా మలుచుకున్నారు.‘పునాది రాళ్ల’తో తన నట జీవితానికి పునాది వేసుకున్న చిరు.. హీరోగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

1978లో ‘పునాదిరాళ్లు’ చిత్రంతో చిరు తన నట జీవితాన్ని ప్రారంభించినప్పటికీ.. ముందుగా రిలీజ్ అయింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’ చిత్రం. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న చిరు మ‌రిన్ని మంచి సినిమాల‌తో మ‌న‌ల్ని అల‌రించాలని కోరుకుందాం..

- Advertisement -