కోవిడ్ టీకా వేయించుకున్న కాజ‌ల్ దంప‌తులు..

46
kajal

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, గౌత‌మ్ కిచ్లూ దంప‌తులు ఫ‌స్ట్ డోస్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. ఈ ఇద్ద‌రు ముంబైలో వాక్సిన్ వేయించుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని అంద‌రితో పంచుకుంది కాజ‌ల్‌. గౌత‌మ్‌తో క‌లిసి దిగిన ఫొటోకు.. ఫ‌స్ట్ షాట్ అయిపోయింది..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కాజ‌ల్ ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న ఆచార్య‌లో వ‌న్ ఆఫ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.