ప్రముఖ పారిశ్రామిక వేత్తతో కాజల్ పెళ్లి!

591
kajal marriage
- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి మరోసారి చర్చాంశనీయమైంది. కాజల్ కు పెళ్లి కుదిరింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఔరంగబాద్ కు చెందిన ఓ పారిశ్రామిక వేత్తను కాజల్ పెళ్లి చేసుకొనుందని సమాచారం. కాగా ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించనట్లు తెలుస్తుంది. త్వరలోనే కాజల్ పెళ్లిపై అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం. అయితే కాజల్ పెళ్లిపై వార్తలు రావడం ఇది కొత్తేమి కాదు. గతంలో చాలా సార్లు కాజల్ పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే తాను పెళ్లీ చేసుకుంటే మొదటగా తన అభిమానులకు తెలిచేయజేస్తానని గతంలో ట్వీట్ చేసింది కాజల్. తనకు నచ్చిన వాడు దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కాగా కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుంది కాజల్. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తుండగా.. తమిళంలో ‘ఇండియన్ 2’, ‘హే సినామికా’లో కనిపించనుంది. అలాగే హిందీలో ‘ముంబయి సగ’లో కాజల్ నటిస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది కాజల్.

- Advertisement -