హర్రర్ కామెడీలకు భిన్నంగా కాష్మోరా..!

296
Online News Portal
kaashmora-time-pass-horror-comedy
- Advertisement -

తెలుగు మరియు తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దూసుకు పోతున్న హీరో కార్తీ. అన్న సూర్యకు ధీటుగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈయన తమిళంలో నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతూ వస్తుంది. యుగానికొక్కడు సినిమాతో వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్న కార్తీ మరోసారి ‘కాష్మోరా’తో వచ్చాడు. మరి భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లిన స్థలం విక్రాంత రాజ్యం. సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలోలుడు. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. మహా పరాక్రమవంతురాలైన యువరాణి రత్నరమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్.

KASHMORA (9)_1561x1200

కాష్మోరా(కార్తీ) తనకు తాను పెద్ద భూతవైద్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుంటాడు. అతనితో పాటు తల్లి, తండ్రి, చెల్లెలు చివరకు ఇంట్లో బామ్మ కూడా భూత వైద్యులుగా బిల్డప్ ఇస్తూ ప్రజల దగ్గరనుంచి డబ్బులు గుంజేస్తుంటారు. దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(యామిని) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది.
అదే సమయంలో ఓ రాజకీయ నాయకుణ్ని మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..? కాష్మోరాకు రాజనాయక్ కు సంబంధం ఏంటి..? రాజనాయక్ కు శాపవిమోచనం అయ్యిందా..? అన్నదే మిగతా కథ.

  KASHMORA (4)_1600x1158

ప్లస్‌ పాయింట్స్‌:
దర్శకుడు గోకుల్‌కి ఇది మూడో సినిమానే అయినా ఎంతో పరిణతిని కనబరుస్తూ… 700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ప్రస్తుత పరిస్థితులను ముడిపెడుతూ రాసుకున్న కథతో దర్శకుడు మంచి ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. ఇక కార్తీ నటనే సినిమాకి ప్రధాన బలం. ఆయన మూడు కోణాల్లో కనిపిస్తూ ప్రతీ సన్నివేశంలోనూ సందడి చేస్తుంటారు. కానీ కథానాయికలకి అసలేమాత్రం ప్రాధాన్యం లేదు. రెండో సగభాగంలోనే నయనతార తెరపైకొచ్చినా ఉన్నంతలో ఆమే ఎక్కువసేపు కనిపిస్తుంది. శ్రీదివ్యకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లేదు. కార్తీ తండ్రిగా కనిపిస్తూ వివేక్‌ చాలా సన్నివేశాల్లో నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం, సంతోష్‌ నారాయణ్‌ సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగా కుదిరాయి.

మైనస్ పాయింట్స్‌:
ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ బాగాలేదు. సెకండాఫ్ ముందుకు వెళుతున్న కొద్ది నిరుత్సాహం తప్ప సినిమాపై పెద్దగా ఆసక్తి కలగలేదు. అలాగే రాజ్ నాయక్ గా కార్తి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ ఆ పాత్ర చిత్రీకరణ అంత ప్రభావంతంగా లేదు. అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్ లలో ఒకే ఉద్ద్యేశ్యంతో ఉన్న సీన్లు పదే పదే రిపీట్ అవ్వడం బోర్ కొట్టించింది. ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా నీరసంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కొత్తగా, ఆసక్తికరంగా ఏమీ లేదు. హర్రర్ కామెడీ మాస్ జానర్ గా వచ్చిన ఈ సినిమాలో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అయితే బాగానే కనబడ్డాయి కానీ హర్రర్ మాత్రం పూర్తిగా మిస్సయింది.

KASHMORA (7)_1600x1067

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాను దర్శకుడు గోకుల్‌ రాసుకున్న కథ.. స్క్రీన్ ప్లేతో సినిమాను రక్తి కట్టించాడు. తక్కువ బడ్జెట్‌లోనే ఈ సినిమాను రిచ్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. సినిమా కోసం వేసిన సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సంగీతం కలిసొచ్చే అంశం. మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్… గ్రాఫిక్స్‌ విభాగాలకు పూర్తి మార్కులు పడ్డాయి. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
ఈ చిత్రం రోటీన్ జానర్లో సాగే సినిమాలకు భిన్నంగా హర్రర్ కామెడీ మాస్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండే సినిమా. ఇందులో ఫస్టాఫ్ ఓపెనింగ్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, సెంకడాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో సాగే కొన్ని సన్నివేశాలు, హీరో కార్తి నటన ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా సెకండాఫ్ లో ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో నడిచే కథ బలంగా లేకపోవడం, పదే పదే రిపీట్ అయ్యే సన్నివేశాలు, మధ్యలో వచ్చే పాటలు, హర్రర్ పూర్తిగా మిస్సవడం ఇందులోని మైనస్ పాయింట్స్. ఓవరాల్గా కాష్మోరా, రొటీన్ హర్రర్ కామెడీలకు భిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్..

విడుదల తేదీ: 28/10/2016
రేటింగ్‌: 3 /5
నటీనటులు: కార్తి, నయనతార, శ్రీదివ్య
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
దర్శకత్వం: గోకుల్

- Advertisement -