కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే అవసరం లేని పేరు. మొదట క్రైస్తవ మతప్రభోదకుడిగా ప్రపంచ ఖ్యాతి గడించిన పాల్.. ప్రస్తుతం ప్రజాశాంతి పేరుతో పోలిటికల్ పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తనదైన ముద్ర వేసేందుకు ఆరాటపడుతున్నారు కేఏ పాల్. కాగా ఎన్నికల మూడు పాల్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. కొన్ని సార్లు పాల్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీకి సంబందించి పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, లక్షలకోట్ల అప్పును జగన్ ఏపీ ప్రజల నెత్తిపై పెట్టారని పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు లేదా జగన్ను గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్లేనని వ్యాఖ్యానించారు. .
ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీ అప్పు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని పాల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా సిఎం జగన్ ఒక 30 నిముషాల సమయం ఇస్తే ఏపీ అప్పులన్నీ తీర్చేస్తా అని తనదైన రీతిలో వ్యాఖ్యానించారు కేఏ పాల్. వచ్చే ఎన్నికలో తమదే అధికారం అని, 100 కు 60 శాతం మంది తాననే కోరుకుంటున్నారని పాల్ చెప్పుకొచ్చారు. మరి ఎన్నికల సమయంలో కనిపించి నానా హడావిడి చేసి.. ఆ తరువాత విదేశాలకు చెక్కేసే పాల్ ఈ సారి ఎన్నికల ముందు రచ్చ చేస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే తెలంగాణలో పాల్ పాదయాత్రకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. కాగా పాల్ వ్యాఖ్యలను ప్రతిఒక్కరు హాస్యాస్పదంగానే తీసుకుంటూ ఉండడంతో పాల్ ను సీరియస్ పొలిటీషిన్ గా తీసుకోవడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి వచ్చే ఎన్నికల్లోనైనా పాల్ కామిడీ నుంచి సీరియస్ పొలిటీషియన్ గా టర్న్ తీసుకుంటారోమే చూడాలి.
ఇవి కూడా చదవండి..