ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట మార్చినట్లు తెలుస్తోంది. నిన్న మెున్నటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తానంటూ చెప్పి పాల్ పవన్‌కు ఆఫర్లపై ఆఫర్లు ప్రకటించాడు. తీరా ఎన్నికల ముగిసిన తర్వాత తన రూట్ మార్చుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగిన కేఏ పాల్ ఇప్పుడు జగన్‌తో పోత్తు పెట్టుకోబోతునట్లు తెలుస్తోంది.
మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పాల్.. ఏపీ రాజకీయాలపై సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాశాంతి పార్టీకి ఈ ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయన్న విషయం చంద్రబాబు సర్వేలో తేలిందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకుంటే ఆయన కోసం ప్రార్థన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ నెల 23న కౌంటింగ్ అనంతరం రాష్ట్ర ప్రజలకు వాస్తవం బోధపడుతుందని, ఏపీ సీఎం ఎవరో నిర్ణయించేది తానేనని పాల్ చెప్పుకొచ్చారు. కేఏ పాల్ నిజాయితీకి మారుపేరంటూ అన్నారు. అయితే, ఈసారి చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చి మనిద్దరం కలిసి పనిచేద్దాం అంటూ జగన్‌కు ప్రతిపాదన చేశారు పాల్. నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం మంచిదంటున్నారు కేఏ పాల్.. నిజాయితీకి తానే మారు పేరంటున్నారు. పాల్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి.