దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి..

208
K Vishwanth felicitated by Pranab Mukherjee
K Vishwanth felicitated by Pranab Mukherjee
- Advertisement -

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో 64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. విశ్వనాథ్‌తో పాటు ఉత్తమ నటుడిగా అక్షయ్‌కుమార్‌, ఉత్తమ నటిగా సోనమ్‌కపూర్‌, నిర్మాత దిల్‌రాజు, నృత్య దర్శకుడు రాజు సుందరం, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్‌, మళయాళ నటి సురభి తదితరులు పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

national-awards-12001

తొలిసారి దాదాసాహెబ్ అవార్డ్‌ గ్రహీతకు ప్రసంగించే అవకాశం ఇచ్చారు. ఈ సంధర్బంగా కే విశ్వనాధ్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తల్లిదండ్రులను స్మరించుకున్నారు. అభిమానులకు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వేజనాసుఖినోభవంతు అంటూ ముగించారు.

nationalawards1c

- Advertisement -