బావా బాహుబలి.. ఈ ఏడాదైన కోరిక తీర్చు

201
Mohan babu praises baahubali2
Mohan babu praises baahubali2
- Advertisement -

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగిపోతుంది. పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుుల రాజమౌళిని పొగడ్తల్లో ముంచేస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు తన దైన శైలిలో ప్రశంసించారు. మోహన్‌ బాబు, ప్రభాస్‌ కలిసి బుజ్జిగాడు మేడ్‌ ఇన్‌ చెన్నై చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా సమయంలో నెలకొన్న ఆప్యాయతతో ఇప్పటికీ కూడా మోహన్ బాబు, ప్రభాస్‌ ఒకర్నొకరు “బావ” అనే పిలుచుకుంటారు.

‘బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. ప్రభాస్ కు విజయీభవ.’ అన్నారు.

ప్రియమైన రానా..బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు..దిగ్విజయోస్తు.. కీర్..మరకతమణిగా..ఎంఎం క్రీమ్ గా..కీరవాణిగా..ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’

యర్ శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని.. నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది.

ప్రియమైన రాజమౌళి..భారతదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని అన్నయ్య ఎన్ టి రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను..

ప్రియమైన ప్రసాద్..బాహుబలి విజయంతో విశ్వ విజయేంద్రప్రసాద్ గా సార్థక నామధేయుడివి అయ్యావు.ఒక తెలుగు రచయితగా విశ్వ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’ అని తన వరుస ట్వీట్లలో మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -