తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సాయంత్రం 4గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంతో ప్ర్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం 12ః30గంటలకు ప్రధాని తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ టూర్ లో కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లారు.
ముఖ్యంగా జోనల్ వ్యవస్ధపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. జోనల్ వ్యవస్ధను మంత్రివర్గం ఇటివలే ఆమోదించింది. ప్రభుత్వం రూపోందించిన కొత్త జోనల్ వ్యవస్ధకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణకు సిఫారసు చేయాలని ప్రధానిని కోరనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ ను తెలంగాణకు చెందేలా ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. నవాబులు నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి బదులుగా ఈ భూమిని కేటాయించిందని, ఈ ఆస్తి అంతా పూర్వ నిజాం ప్రభుత్వానిదేనని ప్రధానికి కేసీఆర్ వివరించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాతక్మంగా చేపట్టిన రైతు బంధు పథకం పై ప్రధానికి వివరించనున్నారు సీఎం కేసీఆర్. రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన విషయాన్ని ప్రధానికి తెలుపనున్నట్లు సమాచారం. హైకోర్టు విభజన, పన్నులలో వాటాపెంపు, పెండింగ్ బిల్లుల విడదులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై రేపు జరగబోయే భేటీలో సీఎం కేసీఆర్ ప్రధానికి తెలుపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసమావేశం ముగిసిన తర్వాత ఈనెల 17న నీతి ఆయోగ్ సమావేశం ఉన్నందున..ఆ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రావాలని ఆహ్వానించింది. దీంతో నీతి ఆయోగ్ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.