నేటి నుంచే పుట్‌ బాల్‌ ప్రపంచ కప్ సంగ్రామం

265
world-cup

యావత్‌ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుట్‌ బాల్ ప్రపంచ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. 32 దేశాల జట్లు.. 12 వేదికలు..11 నగరాలు.. 64 మ్యాచ్‌లు..నెలరోజులపాటు హోరాహోరీగా తలపడే అతిపెద్ద క్రీడా సమరం ఫిఫా ప్రపంచకప్ నేడు ప్రారంభం కాబోతోంది.

FIFA-2018-World-Cup-Featured-866x487సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరి దృష్టి ఫిఫా ప్రపంచకప్‌పైనే ఉంది. పుట్‌బాల్‌ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రపంచకప్‌లో ఏ ఏ జట్లు రాణిస్తాయోనని అంచనాలకు దిగుతున్నారు. ప్రపంచ కప్ 2018 పుట్‌ బాల్‌ ఆతిథ్యహక్కులు తొలిసారిగా రష్యా దేశం దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా ఏ ఇబ్బంది తలెత్తకుండా రష్యా దేశం పుట్‌ బాల్‌ సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

world-cup

ఇవాళ రష్యాలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో టోర్నీ ఆరంభం కానుంది. అక్కడే తొలి మ్యాచ్‌. తొలి మ్యాచ్‌ లో రష్యా, సౌదీ ఆరేబియాలు తలపడనున్నాయి. ప్రపంచకప్ పుట్‌ బాల్‌ షెడ్యూల్‌ ఇదే..

world-cup