ఈనెల 12 తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Also Read: ఏఐ మాయతో చిన్నారులుగా మారిన దేశాధినేతలు..!
విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ హాల్ టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ సంతకాలు తప్పనిసరి కాదని వెల్లడించారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వస్తే వారిని తప్పకుండా అనుమతించాలని బోర్డు అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఎన్సీపీ అధినేతకు బెదిరింపు మెసేజ్..