35శాతంతో పాస్..తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు

36
- Advertisement -

విద్యార్థులకు పరీక్షలంటే భయమెక్కువ దానికి తోడు ఫలితాలు ఏమాత్రం తారుమారైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం మనం చాలా పత్రికల్లో చదివే ఉంటాం. కానీ ఓ తల్లిదండ్రులు మాత్రం కుమారుడు 35మార్కులతో పాసయ్యారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్‌ ట్వీట్టర్ వేదికగా వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Also Read: Odisha:బహనాగ హైస్కూల్‌ కూల్చివేత..

వివారాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని ఠాణెకు చెందిన విశాల్‌ అనే విద్యార్థి అన్ని పరీక్షల్లో 35మార్కులతో గట్టెక్కారు. దీంతో కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. విశాల్‌ తండ్రి ఓ ఆటో డ్రైవర్‌. అయితే అతికష్టమీద పాసైనట్టు తెలిపారు. తన మీద ఉన్న నమ్మకమే నన్ను పాస్ చేసినట్టు విద్యార్థి తెలిపారు. ఇదే విషయాన్ని అవినాశ్ శరణ్ పోస్ట్‌ చేస్తూ నేను కూడా పదవ తరగతి పరీక్షలో 44.7శాతం మార్కులు తెచ్చుకున్నట్టు తెలిపారు. అయితేనేం డిగ్రీ తర్వాత సివిల్స్‌ రెండో ప్రయత్నంలో ఆలిండియా 77వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. అలాగే తన పూర్తి స్థాయి మార్కుల లిస్టును కూడా ట్విట్టర్ పేజీలో పొందుపరిచారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాల స్పందిస్తున్నారు. వీరిలో ఒకరు నేను పదవ తరగతి పరీక్ష పాస్‌ కాగానే మా ఆమ్మ ఒక కిలో బేసన్ లడ్డూలు అందరికి పంచిపెట్టిందని గుర్తు చేసుకున్నారు.

Also Read: ఎన్సీపీ అధినేతకు బెదిరింపు మెసేజ్‌..

- Advertisement -