Australia:కేసీఆర్ క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

43
- Advertisement -

ఆస్ట్రేలియాలో నిర్వహించే సీఎం కేసీఆర్‌ కప్‌ టోర్నీ పోస్టర్‌ను బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో ఆవిష్కరించారు. బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియోద్దిన్, సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్‌ చారి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read: Harish:సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగం

ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యాలు భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ కృషి అమోఘమని కొనియాడారు. టోర్నమెంట్ నిర్వహణ వల్ల సీఎం కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఎజెండా ను ఎన్‌ఆర్‌ఐలందరికీ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా… అలాగే ఉద్యమం నుండి పార్టీ కి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ని కవిత అభినందించారు.

Also Read: ఏఐ మాయతో చిన్నారులుగా మారిన దేశాధినేతలు..!

- Advertisement -