“జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” ఫస్ట్ లుక్..

303
- Advertisement -

నవీన్ చంద్ర-నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్”. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు-కె.బి.చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ వోధిరాల దర్శకుడు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు సుకుమార్ చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు.

Juliet Lover of Idiot Movie First Look

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “అజయ్ వోధిరాల చెప్పిన కథ నచ్చి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. లాజిక్ తోపాటు మ్యాజిక్ ఉన్న క్యూట్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. మా చిత్ర దర్శకుడు అజయ్ వోధిరాల “ఆర్య” మొదలుకొని “100% లవ్” వరకూ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఉండడం విశేషం. ఆ స్నేహబంధంతోనే సుకుమార్ “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Juliet Lover of Idiot Movie First Look

దర్శకుడు అనిరుధ్ వోధిరాల మాట్లాడుతూ.. “అడగ్గానే కాదనకుండా నా మొదటి సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన మా డైరెక్టర్ సుకుమార్‌కి నా ధన్యవాదాలు. ఒక లాజికల్ లవ్ స్టోరీగా “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” చిత్రాన్ని తెరకెక్కించాను. నవీన్ చంద్ర-నివేతా థామస్ ల నేచురల్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.

Juliet Lover of Idiot Movie First Look

నవీన్ చంద్ర, నివేతా థామస్, అలీ, తాగుబోతు రమేష్, దేవన్, అభిమన్యు సింగ్, కాట్రాజ్, రోహిణి, నిలగల్ రవి, జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్-గిరీష్ గంగాధరన్, సంగీతం: రతీష్ వేగ, ఎడిటింగ్; ఎస్.బి.ఉద్ధవ్, కళ: రాజీవ్ నాయర్, పోరాటాలు: రన్ రవి-జాషువా, స్టిల్స్: ఆనంద్, కాస్ట్యూమ్స్: స్పూర్తి పూనమ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి-అనంత్ శ్రీరామ్-కరుణాకర్-సర్వా రావు, కథ: రాజ్ శివ సధాని, మాటలు: కె.వేణుగోపాల్ రెడ్డి-శ్రీనాధ్ బదినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి, నిర్మాతలు: కొత్తపల్లి ఆర్.రఘుబాబు-కె.బి.చౌదరి, దర్శకత్వం: అజయ్ వోధిరాల!

- Advertisement -