శ్రీవిష్ణుకి ఇంత కన్ఫ్యూజనా..?

219
- Advertisement -

తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు. “పెళ్ళిచూపులు”తో సినిమా నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టించారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం “మెంటల్ మదిలో”. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఆశ్చర్యపరిచిన శ్రీ విష్ణు ఈ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయ్యాడు. ‘మెంటల్ మదిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్లెజెంట్ ఫీలింగ్ ఇవ్వగా.. తాజాగా రిలీజైన ఈ చిత్ర టీజర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. టీజర్ వెరైటీగా కట్ చేసి జనాల్లో ఆసక్తి పెంచారు.

Mental Madhilo Movie Teaser

ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యే కుర్రాడి కథ ఇది. అనగనగా ఒక రాజు.. అతను యుద్ధం చేయాలనుకున్నాడు.. కానీ యుద్ధానికి గుర్రం మీద వెళ్లాలా.. రథం మీద వెళ్లాలా అని కన్ఫ్యూజ్ అవుతుండగా.. శత్రు సైన్యం వచ్చి అతణ్ని చంపేశారు అంటూ శ్రీ విష్ణు వాయిస్ తో వినిపించే ఓ కథ ద్వారా కథానాయకుడి గందరగోళ మనస్తత్వాన్ని పరిచయం చేశారు టీజర్లో. అరవింద్ కృష్ణ అనే తన పేరును అవతలి వాళ్లు అరవింద్ అని పిలుస్తారా.. కృష్ణ అని పిలుస్తారా అని హీరోకు కన్ఫ్యూజన్. ఇలా అన్నింటికీ కన్ఫ్యూజ్ అయ్యే హీరో తన జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా. టీజర్ అయితే ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ‘పెళ్లిచూపులు’ తర్వాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న సినిమా ఇది కావడం విశేషం.

అయితే మెంటల్ మదిలో టీం ఒక వినూత్న విధానంలో హీరో అరవింద్ కృష్ణ పాత్రని, ప్రముఖ దర్శకులు నటులు అవసరాల శ్రీనివాస్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేశారు. జూలై చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయ్యానున్నారు. శ్రీవిష్ణు-నివేతాల జంట చాలా బాగుందని శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ “మెంటల్ మదిలో” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బృందం వ్యక్తం చేసింది. ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం “మెంటల్మదిలో” అని గర్వంగా చెప్పగలను” అన్నారు రాజ్‌ కందుకూరి. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ఎడిటర్: విప్లవ్ న్యాషాదమ్, నిర్మాత: రాజ్ కందుకూరి, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ!

- Advertisement -