స్వీయ‌నియంత్ర‌ణ‌తో క‌రోనాను త‌రిమికొడ‌దాంఃఎమ్మెల్యే మాగంటి

273
- Advertisement -

స్వీయ‌నియంత్ర‌ణ‌తో క‌రోనాను త‌రిమికొడదాం అన్నారు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. కరోన వ్యాధి వ్యాప్తి కట్టడికి జూబ్లీహిల్స్ నియొజక వర్గం రహమత్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ పర్యటించి అవగాహన కల్పించారు.

ఈసంద‌ర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ…కరోన వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి అంటే స్వీయనియంత్రణ పాటించాలి అన్నారు. ప్రభుత్వం సూచిస్తున్న సూచనలు సలహాలు పాటించాలి అని కోరారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరు స్వీయనియంత్రణ పాటించి షాప్ ల వద్దకు గంపులు,గుంపులు గా కాకుండా సోషల్ డిస్టన్స్ పాటించి సరుకులు తీసుకోవాలి అన్నారు. రోజు వారీ కూలీలకు అన్నపూర్ణ పథకం ద్వారా ఉచిత ఆహారం 200 మందికి అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రతిఒక్కరికి అండగా ప్రభుత్వం ఉంది .ఎవరు ఇబ్బందులకు గురికావద్దని భ‌రోసా ఇచ్చారు.

- Advertisement -