ఎన్టీఆర్ కొత్త పార్టీని పెట్టబోతున్నాడా….?

869
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2019 ఎన్నికల్లో మూడు ముక్కలాటకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ లైన్లోకి రానుంది. దీంతో రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమని తేలిపోయింది. ప్రత్యేక హోదాపై, ప్యాకేజీలపై అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్ అనంతపురం సభా వేదికగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. దీంతో టీడీపీకి, వైసీపీల గతి అధోగతేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Jr NTR starting New Political Party
అయితే టీడీపీ ప్రత్యేక హోదా సాధించడం అనేది… ఎలాగో గంగలో కలిసిపోతే పోయింది కానీ.. ఎన్టీఆర్ వారసుడిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తెదేపా వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ వారసులైన కుమారులు రాజకీయాల్లో అంతగా రాణించలేకపోవడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారట. ఈ మూడు పార్టీలకు చెక్ పెట్టే దిశగా జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలని సీనియర్లు భావిస్తున్నారట. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

Jr NTR starting New Political Party

ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే తప్పకుండా ఆ పార్టీకే క్రేజ్ పెరుగుతుందని కొందరంటే.. అప్పుడు పవన్ పార్టీ వర్సెస్‌ ఎన్టీఆర్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్టీఆర్ పెట్ట‌బోయే కొత్త పార్టీలో అత‌డికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నాడన్నది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వారితో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ, కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఎన్టీఆర్ పార్టీలో కీలక భూమిక వహించబోతున్నారట. ఎన్టీఆర్ పార్టీ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలు రసవత్తరంగా మారడం ఖాయం.

Jr NTR starting New Political Party

ఎన్టీఆర్ తో ఇప్పటికే సుమారు 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట.. వారంతా నందమూరి వారసుల పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే…

- Advertisement -