హ్యాపీ బర్త్ డే కళ్యాణ్‌ అన్నా: ఎన్టీఆర్

304
kalyanram birthday
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్‌ పుట్టినరోజు నేడు. నేటితో 43వ వసంతంలోకి కళ్యాణ్ రామ్ అడుగుపెడుతుండగా టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అన్న కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.

సోద‌రుడిగానే కాకుండా నాకు స్నేహితుడిగా, దిశా నిర్దేశ‌కుడిగా, గైడ్‌గా ఉన్నావు. హ్యాపీ బ‌ర్త్‌డే క‌ళ్యాణ్ అన్నా.. నువ్వు చాలా గొప్ప‌వాడివి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు ఎన్టీఆర్.

బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు కళ్యాణ్ రామ్‌. తర్వాత తొలిచూపులోనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌..వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ ముందుకుసాగుతున్నారు. హీరోగానే కాదు నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.

- Advertisement -