క్వింటన్ డికాక్‌ @ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్

406
de kock
- Advertisement -

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌,స్టార్ బ్యాట్స్‌మెన్‌ క్వింటన్ డికాక్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు డికాక్. కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణిస్తున్న డికాక్‌…ఈ ఏడాది ఆరంభంలో వన్డే, టీ20 కెప్టెన్ బాధ్యతలు చేపట్టడాఉ. జట్టను విజయపథంలో ముందుకు నడిపిస్తున్నారు. వన్డే, టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డును పేసర్‌ లుంగి ఎంగిడి దక్కించుకున్నాడు.

2017లోనూ అతడు సౌతాఫ్రికా క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా వర్చువల్‌గా నిర్వహించింది. డుప్లెసిస్​ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాక డికాక్ సారథ్యంలోని సఫారీ జట్టు వన్డే సిరీస్​లో ఆస్ట్రేలియాను 3-0తో చిత్తుచేయగా… ఇంగ్లండ్​ను టీ20 సిరీస్​లో ఓడించింది.

- Advertisement -