జీ20 సమ్మిట్‌కు బైడెన్!

14
- Advertisement -

అమెరికాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి చేసిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయన ఢిల్లీలో జరిగే జీ 20 సమ్మిట్‌కు హాజరవుతారని వెల్లడించింది.

బైడెన్ భార్య జిల్‌ బైడెన్‌కు పాజిటివ్‌ తేలడంతో అధ్యక్షుడికి సోమవారం, మంగళవారం వరుసగా కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్‌ వచ్చినట్లు వెల్లడించింది. దీంతో బైడెన్‌ గురువారం ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వెల్లడించింది. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

అధ్యక్షుడు బైడెన్‌ భారత్‌ పర్యటకు రావడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పటికే ఢిల్లీ మొత్తం పోలీసుల వలయంలో ఉంది. అగ్రనేతలు వస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read:చీరకట్టులో మెరిసిన శ్రీయాసరన్!

- Advertisement -